NTV Telugu Site icon

Ashika Ranganath: ఆ పిల్ల చాలా హాట్ గురూ…

Ashika Ranganath

Ashika Ranganath

ఫిబ్రవరి 10న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ కనిపించిన ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లిన నందమూరి అభిమానులు మంచి జోష్ లో బయటకి వచ్చారు. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసిన అమిగోస్ సినిమాలో ‘అషిక రంగనాథ్’ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ కి కూడా మంచి డెబ్యు అయ్యింది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన మొదటి సినిమా ‘అమిగోస్’. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో అషిక ప్రామిసింగ్ గా కనిపించింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంతే గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది.

రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో మోడరన్ లుక్ అషిక రంగనాథ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసిన అషిక, తాజాగా బీచ్ లో కూర్చోని మరో మూడు ఫోటోలని పోస్ట్ చేసింది. ఇందులో అషిక డెనిమ్ షార్ట్స్, ఆరెంజ్ కలర్ షర్ట్, వైట్ టాప్ వేసుకోని కనిపించింది. నడుము అందాలని చూపిస్తూ, మత్తెక్కించే కళ్ళతో కనిపిస్తున్న అషిక… “బీచ్ ని చూడాలా లేక హీరోయిన్ నడుముని చూడాలా అని అయోమయంలో పడేలా” ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. మాల్దీవ్స్ నుంచి ఈ ఫోటోలని అషిక రంగనాథ్ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఫోటోస్ చూసిన ఫాన్స్, కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ్లామర్ లుక్స్ బాగానే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్టింగ్, గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకుంది కాబట్టి గ్లామర్ షోకి అడ్డేమి లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేసినంత వరకూ స్కిన్ చేస్తాను అనే హింట్ మేకర్స్ కి ఇస్తే చాలు అషిక కెరీర్ కి మంచి బూస్టింగ్ వచ్చినట్లే. ఇప్పటికే తెలుగులో కన్నడ నుంచి వచ్చిన అనుష్క శెట్టి లేడీ సూపర్ స్టార్ అయ్యింది. పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అవ్వగా, యంగ్ బ్యూటీ శ్రీలీలా తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే రేసులో ఉంది. బిగ్ స్టార్స్ తో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. మరి ఈ కొత్త హీరోయిన్ అషిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Show comments