NTV Telugu Site icon

Ashika Ranganath: ఈ బ్యూటీ బాగానే ఉంది కానీ సాలిడ్ బ్రేక్ రాలేదు…

Ashika Ranganath

Ashika Ranganath

కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది కానీ ఒక డెబ్యు హీరోయిన్ కి కావాల్సిన సాలిడ్ ఎంట్రీకి మాత్రం అషికకి ఇవ్వలేకపోయింది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక స్క్రీన్ పైన ప్రామిసింగ్ గా కనిపించింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంతే గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది.

అమిగోస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని చూసి ఉంటే అషిక రంగనాథ్ కి తెలుగులో చాలా మంచి ఆఫర్స్ వచ్చేవి కానీ అమిగోస్ సో సో గానే ఆడడంతో అషికకి తెలుగులో ఆఫర్స్ కరువైనట్లు ఉన్నాయి. అమిగోస్ తర్వాత అషిక తెలుగులో ఇంకో సినిమాకి సైన్ చెయ్యలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఫాన్స్ ని అయితే అషిక ఎంటర్టైన్ చేస్తుంది కానీ ఆ ఫోటోషూట్స్ తెలుగు సినిమా అవకాశాలని మాత్రం తీసుకోని రాలేకపోతున్నాయి. లేటెస్ట్ గా బ్లూ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలని అషిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో అషిక చాలా గ్లామరస్ గా కనిపించింది. యాక్టింగ్, గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకుంది కాబట్టి గ్లామర్ షోకి అడ్డేమి లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేసినంత వరకూ స్కిన్ షో చేస్తాను అనే హింట్ మేకర్స్ కి ఇస్తే చాలు అషిక కెరీర్ కి మంచి బూస్టింగ్ వచ్చినట్లే, అందుకే అషిక ఫోటోషూట్స్ ని నమ్ముకున్నట్లు ఉంది.

Show comments