ART Cinemas began with a formal pooja: ఏషియన్ థియేటర్స్ సంస్థ ఇప్పటికే పలువురు హీరోలతో కలిసి కొన్ని మల్టీప్లెక్స్ లను నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏఎంబి సినిమాస్, విజయ్ దేవరకొండ తో ఏవిడి సినిమాస్, అల్లు అర్జున్తో కలిసి త్రిబుల్ ఏ సత్యం సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ లను మొదలుపెట్టి విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మరో హీరోతో కలిసి ప్రాజెక్టు మొదలు పెట్టింది. ఆయన ఇంకెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ఏషియన్ సినిమాస్ కొత్త వెంచర్ ఏ ఆర్ టి సినిమాస్ అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ నిన్న అధికారిక పూజా లాంఛనాలతో ప్రారంభమైంది.
Salman Khan Firing: సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక ఆధారాలు లభ్యం!
నిన్న పూజా కార్యక్రమాలలో ఏషియన్ సునీల్ కుటుంబ సభ్యులతో పాటు రవితేజ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. థియేటర్లు ఇంకా సిద్ధం కాలేదు కానీ నిన్నటి పూజా కార్యక్రమాలతో ఆ పనులు ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఈ ఏఆర్టి సినిమా సంస్థ కొత్త థియేటర్ల చైన్ గా అవతరించబోతోంది. ఇక మరో పక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్స్ స్థలంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి ఏషియన్ సంస్థ థియేటర్ ప్రారంభించబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ఆ థియేటర్లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
