నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.
‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన అర్జున్ S/o వైజయంతి ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా బిజినెస్ కు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ కు గాను రూ. 12 కోట్లు వరకు రేట్ పలుకుతోంది. అటు రాయలసీమ ఏరియా అయిన సీడెడ్ వరకు రూ. 3.70 కోట్లు చెబుతున్నారు మేకర్స్. ఇక నైజాం, ఓవర్సీస్ ధర ఫిక్స్ కావాల్సి ఉంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్నారు. ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఏప్రిల్ 17 లేదా 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.