NTV Telugu Site icon

కాస్ట్లీ కారు కొన్న “బిగ్ బాస్” బ్యూటీ

Ariyana

యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ గత సంవత్సరం ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన ఇంటర్వ్యూతో మరింత పాపులర్ అయ్యింది. పైగా గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆ బోల్డ్ ఇంటర్వ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ టాక్ షోకి హోస్ట్ చేస్తోంది. ఇందులో ఆమె ఎలిమినేటెడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి వివాదాస్పద విషయాలను రాబట్టడానికి చూస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.

Read Also : ‘మా’ ఎన్నికలపై కామెంట్స్… నానిపై సినీ పెద్దల అసంతృప్తి ?

“బిగ్ బాస్” బ్యూటీ అరియనా కొత్త కారు కొనేసింది. షోరూమ్ లో తన పక్కన ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన స్టైలిష్ బ్లాక్ 4-వీలర్ కొత్త కియా కారులో బిగ్ బాస్ హౌస్‌మేట్, నటుడు సోహెల్, స్నేహితుడు, టీవీ నటుడు అమర్‌దీప్‌తో కలిసి మొదటి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు.

View this post on Instagram

A post shared by Ariyana Glory (@ariyanaglory)