సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటెన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రాత్రి మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‌ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు.
అయితే తాజాగా, సాయి తేజ్ హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. అంతర్గత గాయాలు ఏమి లేవని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని అపోలో వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అటు ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటిది ఏమిలేదన్న వైద్యులు.. చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తున్నారని తెలిపారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్ సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు అన్నారు. డాక్టర్ అలోక్ రంజన్ పర్యవేక్షణలో సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Also Read
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో కొద్దిసేపటికి క్రితమే డాక్టర్లు ఆయన్ను స్పృహలోకి రప్పించే ప్రయత్నం చేశారు. స్పృహలోకి వచ్చిన సాయితేజ్ నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడారు. కాలర్ బోన్ కు శస్త్రచికిత్స అవసరమైన అది పెద్ద సమస్య కాదని.. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేషన్ మీద చికిత్స చేస్తున్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం ఏమి లేదని అన్నారు.

తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి