క్రిష్ – అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఘాటీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ వైరల్ అవుతోంది. అయితే ప్రేక్షకుల రియాక్షన్ ప్రకారం – సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన బలం గా నిలిచాయి. ప్రత్యేకించి అనుష్క శెట్టి నటన గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అనుష్క తన అభినయం, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందని కామెంట్లు వస్తున్నాయి.
Also Read : Mirai : సెన్సార్ పనులు ముగించుకున్న ‘మిరాయ్’.. రన్‌టైమ్ ఎంతంటే ?
అయితే, కొన్ని సన్నివేశాలపై మాత్రమే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సనివేశాలు సాగదీసినట్లుగా బోరింగ్‌గా అనిపించాయని, కథనం కొంతవరకు ఊహించదగ్గ ఉందని కొందరు చెబుతున్నారు. కానీ మొత్తం మీద సినిమాపై ఎక్కువమంది పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సినీ వర్గాల అంచనాల ప్రకారం, ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. కథలోని చిన్న లోపాలను పక్కనపెడితే, అనుష్క నటన, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ సినిమాను విజయవంతం చేసే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ‘ఘాటీ’ అనుష్క కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.
