లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “నేత్రికన్” మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కన్పించి మెప్పించింది. సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా తన తమ్ముడితో పాటు కళ్ళు పోగొట్టుకుంటుంది. మళ్ళీ ఆపరేషన్ ద్వారా కళ్ళు తెచ్చుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తుంటుంది. ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు. కళ్ళు లేని హీరోయిన్ ఆ సైకో ఆటలు ఎలా కట్టించింది ? అనేదే కథాంశం. ఇందులో నయన్ అద్భుతంగా నటించింది. అయితే ఇప్పుడు నయన్ పాత్రలో అనుష్క కనిపించబోతోంది అంటున్నారు. ఇదైతే అనుష్క అభిమానుల కోరికలా కన్పిస్తోంది. “నేత్రికన్” మూవీ తెలుగులో రీమేక్ కాబోతోందని, అందులో అనుష్క నటిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి.
Read Also : ‘క్రేజీ అంకుల్స్’ అడల్ట్ సినిమా.. అడ్డుకుంటాం!
ఈ వార్త గనుక నిజమైతే ఈ చిత్రం అనుష్కకు సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. ఇంతకు ముందు అనుష్కకు చెవిటి, మూగ పాత్రలో నటించిన అనుభవం ఉంది. ఇంతకు ముందు ఆమె “నిశ్శబ్దం” మూవీలో అలా కన్పించింది. మాధవన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క మంచి నటనను కనబర్చింది. ఇతర భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆడలేదు. అయినప్పటికీ అనుష్కకు ఛాలెంజింగ్ పాత్రలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఆమె అరుంధతి, బాహుబలి, భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో చేసినవన్నీ ఛాలెంజింగ్ పాత్రలే. అన్ని పాత్రల్లోనే అనుష్క అదరగొట్టేసింది. అలాగే ఇప్పుడు “నేత్రికన్” మూవీలో ఆమెకు అవకాశం వచ్చినా కూడా అనుష్క అదరగొడుతుంది అని అంటున్నారు. నిజమే కదా… నయన్ పాత్రలో అనుష్క అదరగొట్టేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
2020లో “సైలెన్స్” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ తరువాత మరో సినిమాలో కన్పించలేదు. దీంతో అనుష్క పెళ్లి అని, లేదు నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందంటూ పుకార్లు వచ్చాయి. కానీ వాటిలో ఏవీ నిజం కాలేదు. ఆమె నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దర్శక నిర్మాతలు ఏం అనుకుంటున్నారో చూడాలి.
