Site icon NTV Telugu

Anushka: పెళ్లి వద్దురా బాబు… మ్యాచో మ్యాన్ దొరకట్లేదు…

Anushka

Anushka

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ సాంగ్ ‘నో నో నో’ని మేకర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి వద్దురా బాబు, అసలు మనకి ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు, సింగల్ లైఫ్ ఏ బెటర్ అంటూ అనుష్క POVలో సాగిన సాంగ్ ఇది. అమ్మాయిల పెళ్లి బాధలకి కాస్త ర్యాప్ టచ్ ఇస్తూ రాధన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ అండ్ మానసి వోకల్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్స్ గా నిలిచాయి. రియల్ లైఫ్ లో అనుష్క ఒరిజినల్ ఫీలింగ్స్ ని చెప్పేలా ఈ ‘నో నో నో’ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో అనుష్క చాలా క్యూట్ గా, ఎవర్ చార్మింగ్ గా కనిపించింది. కాస్త చబ్బీగా ఉన్నా కూడా అట్రాక్టివ్ ఫేస్ తో అనుష్క ఇంప్రెస్ చేసింది. మరి మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో అనుష్క మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Read Also: Yash: ఇది KGF 3 కాదు పెప్సీ యాడ్…

Exit mobile version