Ghaati : అనుష్క శెట్టి నటించిన ఘాటీ మూవీ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. జులై 11న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనుష్క, ప్రభు మీద దీన్ని డిజైన్ చేశారు. క్రిష్ లిరిక్స్ అందించగా.. లిప్సిక, సాగర్ నాగవెల్లి, సోనీ సాంగ్ ను పాడారు. సాగర్ నాగవెల్లి మ్యూజిక్ అందించాడు అందించారు. ఈ మూవీని క్రిష్ మంచి బడ్జెట్ తో తీస్తున్నారు.
Read Also : Kubera : కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..
తాజాగా రిలీజ్ చేసిన పాట.. జానపద ఊపుతో ఆకట్టుకుంటోంది. “సైలోరే” సాంగ్ లో అనుష్క, విక్రమ్ ప్రభు ఆకట్టుకుంటున్నారు. ప్రకృతిసౌందర్యంతో పాటు పాట సాగే విధానం అన్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. అనుష్కు పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కెట్ ఉంది. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. ఇందులో అనుష్క పాత్ర చాలా రఫ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఒక ఊరి సమస్యల కోసం పోరాడే పవర్ ఫుల్ మహిళగా ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..
