రీసెంట్ గా విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘సైయారా’ . చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయం పై ప్రముఖ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తాను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ కూడా అదే రోజు విడుదలైంది, కానీ ‘సైయారా’ హిట్ కావడంతో..
Also Read : OG -AOR : ఓజీ థియేటర్లలో అనగనగా ఒక రాజు..
తన సినిమా ఎవరు గుర్తించలేదు..దీంతో “తన్వి ది గ్రేట్’ కోసం నాలుగేళ్లు కష్టపడ్డాను. ఒక సంవత్సరం స్క్రిప్ట్ రాయడానికి, ఇంకో సంవత్సరం సంగీతానికి సమయం కేటాయించాను. కానీ ‘సైయారా’ తో పాటు మా సినిమా విడుదల కావడం దురదృష్టం ‘తన్వి ది గ్రేట్’ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. నా వెంట ఉన్న 200 మందికి పైగా టీమ్ సభ్యుల కష్టం వృధా అయింది” అని అనుపమ్ చెప్పారు. అదే సందర్భంలో ఆయన సినిమా ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి కూడా ప్రస్తావించారు..
“విడుదలకు ముందే ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాం. భారీ బడ్జెట్ కావడంతో ఖర్చుల కోసం స్నేహితుల సహాయం తీసుకున్నా. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాం, రాష్ట్రపతికి కూడా చూపించాం. అందరూ ప్రశంసించారు కానీ, ప్రేక్షకులు మాత్రం గుర్తించలేదు.. ఒకటి మాత్రం అర్ధం అయింది. ప్రపంచం ఒక ప్రేమకథను చూడాలనుకుంది. అందుకే ‘సైయారా’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే, విజయం సాధించిన చిత్రం కోసం.. ఇంకో సినిమా 400 థియేటర్లలో రిలీజ్ అయిన కూడా పట్టించుకోరు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
