Site icon NTV Telugu

Ante Sundaraniki Trailer: హిందువుల అబ్బాయి.. క్రిస్టియన్ల అమ్మాయి పెళ్లి గోల

Nani

Nani

న్యాచురల్ స్టార్ నాని- మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ‘బ్రోచేవారెవరు రా’ లాంటి డీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శహకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఏంత్తో ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా ఫన్ ఫుల్ గా ఉంది. పిల్ల జమీందార్ చిత్రంలో కనిపించిన నాని కనిపించాడు ట్రైలర్ లో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఎవరా అమ్మాయి? హిందువులేనా? చెప్పి చావరా? అన్న నరేష్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. హిందూ ధర్మాన్ని పాటించే విశ్వనాథ శాస్త్రి గారి ఏకైక మనవడు సుందరం.. అతడిని చిన్నప్పటినుంచి తల్లి, తండ్రి, నానమ్మ ఎంతో భక్తి శ్రద్దలతో పెంచుతారు. చిన్నపాటి నుంచి అతడికి ఉన్న గండాలకు పూజలు చేస్తూ సుందరానికి విరక్తి తెప్పిస్తుంటారు. అయితే సుందరానికి ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలి అనేది కోరిక.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం.. వారు ఒప్పుకోకపోవడం జరుగుతున్న నేపథ్యంలోనే అతడికి లేడీ ఫోటోగ్రాఫర్ లీలతో పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతోంది. అయితే ఆమె క్రిస్టియన్ కావడంతో వీరి ఇద్దరి పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోరు.. దీంతో ఒకానొక సమయంలో ఇద్దరు ఇంట్లో ఉంచి వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తారు.. ఇక మధ్యలో వీరి మధ్యలో జరిగిన గొడవలు.. మళ్లీ ఎందుకు వీరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు..? చివరికి ఈ జంట ఒక్కటవుతుందా..? సుందరంకు ఉన్న పెళ్లి గండం పోతుందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సాంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లను నిష్టగా ఆచరించే సుందరం కుటుంబం ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది వినోదాత్మకంగా చూపించారు. ఇక బ్రాహ్మణ యువకుడిగా నాని పండించిన హాస్యం థియేటర్లో ఎవరిని సీట్ల మీద కుర్చోనివ్వదు అనిపిస్తుంది. తండ్రి నరేష్- నాని ల మధ్య వచ్చే సంఘటనలు ఎంతో వినోదాన్ని పంచేలా ఉన్నాయి. ఇక లీల గా నజ్రియా ఎంతో న్యాచురల్ గా నటించింది. వివేక్ సాగర్ సంగీతం ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొనేలా చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మరి ఈ సినిమాతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Exit mobile version