Site icon NTV Telugu

Japan: ‘జపాన్’ తెలుగు హక్కులు కొనేసిన నాగార్జున

Karthi Japan

Karthi Japan

Annapurna Studios Bag the Telugu Rights Of Karthi’s Japan:వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాగా ‘జపాన్‌’ అనే సబ్జెక్ట్ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ ‘జపాన్‌’ దీపావళికి విడుదలవుతుండగా, నాగర్జున అండర్ లో నడిచే అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు హక్కులు ఫ్యాన్సీ అమౌంట్ కి దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాజెక్ట్ లోకి రావడంతో సినిమా గ్రాండ్ గా భారీ ఎత్తున విడుదల కానుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్ తో ఒక క్లారిటీ వచ్చింది.

Devil: క‌ళ్యాణ్ రామ్ స్పై ‘డెవిల్’ కోసం మరో బాలీవుడ్ భామ

జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్ ఉంటుందని, కథాంశం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్‌ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతుండగా ఎస్ రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఊపిరి సినిమా సమయంలో నాగార్జున, కార్తీ మధ్య మంచి బంధం ఏర్పడింది. అప్పటి నుంచే కార్తి అన్గాన్ని సినిమాలను తెలుగులో అన్నపూర్ణ సంస్థనే కొనుగోలు చేస్తూ వస్తోంది.

Exit mobile version