Site icon NTV Telugu

Anil Ravipudi: అందుకే ఐపీఎల్ గురించి అలా మాట్లాడా.. రావిపూడి క్షమాపణలు !

Anil Ravipudi At Trailer La

Anil Ravipudi At Trailer La

Anil Ravipudi Clarity on IPL Comments: ఈ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Poonam Kaur: బాలకృష్ణ చిన్నల్లుడిపై పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. అయితే ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా బయటకు వెళ్లాయి. ఆరోజు చిన్న సినిమాలకు జనం రావడం లేదని ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాటలు విని అలా మాట్లాడి ఉంటాను. అయితే నా మాటలని నేను కరెక్ట్ చేసుకుంటా, ఐపీఎల్ చూడండి, మా సినిమాలూ చూడండి, నేనూ ఐపీఎల్ చూస్తుంటా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు. దర్శకరత్న దాసరి గారి జయంతి రోజు ప్రతిసారీ మనమంతా ఇలాగే కలవాలని కోరుకుంటున్నా, డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మా దర్శకులంతా సిద్ధమవుతున్నాం. స్కిట్స్, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. ఇది మన సంఘం కోసం, మన సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్నది, ఈ కార్యక్రమం ద్వారా పోగయ్యే ప్రతి రూపాయి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉపయోగపడుతుందన్నారు.

Exit mobile version