Anchor Shyamala Clarity on Bangalore Rave Party: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు పార్టీ ఎప్పుడు జరిగిందో? ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తోంది, అసత్య ప్రచారం చేస్తున్నారు.
Rave Party: అది రేవ్ పార్టీ కాదు.. జరిగింది ఇదే.. వీడియో రిలీజ్ చేసిన నటి!
ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానం అయి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ మీద, నా మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ల మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది. కానీ జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు అంటూ ఆమె వీడియోలో మాట్లాడారు. ఇక మరో ఛానల్ లో ఆమె మాట్లాడుతూ 2019లో నేను వైసీపీలో చేరుతున్నప్పుడు వైఎస్ జగన్ గారితో కలిసి ఉన్న ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.