Site icon NTV Telugu

Birthday Look: ‘వాంటెడ్ పండుగాడ్’ అంటున్న అనసూయ!

Anasuya Wanted Padugadu

Anasuya Wanted Padugadu

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మిస్తున్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. ఆదివారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ”ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మ‌హి రెడ్డి పండుగుల సినిమాటోగ్ర‌ఫర్ కాగా, పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Whatsapp Image 2022 05 15 At 6.22.58 Pm

Exit mobile version