Telugu Hero Raja Joins Indian National Congress: నటుడు, హీరోగా పలు సినిమాలు చేసిన రాజా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెన్నెల, ఆనంద్ లాంటి సినిమాలతో పక్కింటి అబ్బాయిగా ముద్ర వేసుకుని అందర్నీ ఆకట్టుకున్న రాజా అసలు పేరు రాజా అబేల్. రాజా తల్లి బ్రిటిషర్ కాగా తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు సందర్భాల్లో వెల్లడించారు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజా శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. హీరోగా ఆయనకు వెన్నెల సినిమాతో గుర్తింపు వచ్చింది. పార్వతి మెల్టన్, రాజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా హీరోహీరోయిన్లకి మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజా ఆ తరువాత సరైన స్టోరీలను ఎంచుకోక పోవడంతో హిట్లు కరువయ్యాయి.
Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్
ఈ క్రమంలో సినిమాలకు దూరమైన ఆయన ఒకప్పుడు వైఎస్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన మరణం తరువాత పార్టీ నుండి బయటికి వచ్చి పాస్టర్ అయ్యాడు. పాస్టర్ గా దైవ సేవలో మునిగి తేలుతున్న ఆయన ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఈ క్రమంలో రాజా మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని అన్నారు. కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన అన్ని వర్గాలకీ న్యాయం చేసే పార్టీగా కాంగ్రెస్ ఉందని అన్నారు. జాతీయస్థాయిలో తెలుగువారికి లీడర్ గా ఉండే అవకాశం నాకు కాంగ్రెస్ వలన వచ్చిందన్న రాజా మణిపూర్ అంశంలో చాలామంది నోరు మెదపలేకపోయారని విమర్శించారు. రాజకీయ పదవులు ఇస్తారు కానీ ఆశిస్తే రావని రాజా పేర్కొన్నారు.