Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?

Epic 300kb

Epic 300kb

Epic: బేబీ’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ వస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’ (EPIC). ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.’90s – ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో ఆమె ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన హీరో ఆనంద్ దేవరకొండ రష్మికను ఎంతో ఆప్యాయంగా ‘వదినమ్మ’ అని సంబోధించగా, రష్మిక సైతం ఆనంద్‌ను ప్రశంసిస్తూ అతను కేవలం గ్రీన్ ఫ్లాగ్ మాత్రమే కాదు.. ఒక పెద్ద ‘గ్రీన్ ఫారెస్ట్’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సినిమా రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో తమ్ముడు ఆనంద్ సినిమా కోసం అన్నయ్య విజయ్ దేవరకొండ రంగంలోకి దిగబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 8న విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ విజయ్ ఈ ఈవెంట్‌కు వస్తే మాత్రం ‘ఎపిక్’ ప్రమోషన్స్‌కు ఒక్కసారిగా పెద్ద బూస్ట్ దొరికినట్టే. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఆనంద్‌కు అండగా నిలిచారు. ఇటీవల జరిగిన ‘ఎపిక్ ఫస్ట్ సెమెస్టర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని సినిమాపై తన సపోర్ట్‌ను చూపించారు. ఆనంద్‌ను తన కుటుంబ సభ్యుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా తాను గర్వపడుతున్నాననే విధంగా రష్మిక మాట్లాడటం అభిమానులను ఆకట్టుకుంది. సినిమా ట్రైలర్‌ను కూడా ఆమె ప్రశంసించారు. దీంతో ఇప్పుడు విజయ్ కూడా తమ్ముడి సినిమా కోసం వస్తారా ? వస్తే ఎలాంటి హంగామా ఉండబోతోంది ? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.