Site icon NTV Telugu

Anand Deverakonda: టాలీవుడ్లో ఆ ధోరణి మంచిది కాదు : ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda

Anand Deverakonda

Anand Deverakonda Speech At Gam Gam Ganesha Trailer Launch Event : ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ సినిమా పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటుంది. అతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సినిమా డైరెక్టర్స్ మీడియం.

Anand Deverakonda: ఫ్యామిలీ స్టార్ నెగిటివిటీ ఆ గ్రూప్ పనే.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

వారికే మొదట ప్రాధాన్యత దక్కాలి. నిన్న డైరెక్టర్స్ డే ఘనంగా జరుపుకున్నాం. డైరెక్టర్స్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. ఇండస్ట్రీ ప్రేక్షకులు మీడియా అభిమానులు మనమంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలో ఏ మంచి జరిగినా, ఎవరు ఏది అఛీవ్ చేసినా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇవాళ చిత్ర పరిశ్రమలో కాంపిటీషన్స్ నుంచి కంపారిజన్స్ వైపు వెళ్తున్నాం. ఎవరైనా పెద్దవాళ్లు ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి. అలా కాదు. మనమంతా మన ఇండస్ట్రీ వాళ్లు సాధించే విజయాలు సెలబ్రేట్ చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా రియలిస్టిక్, న్యాచురల్ మూవీస్ చేశాను. గం గం గణేశాలో ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో వస్తున్నా. ఇది టిపికల్ జానర్ మూవీ. క్రైమ్ కామెడీ కథతో ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో ఈ నెల 31న గం గం గణేశా చూసి బ్లెస్ చేయండన్నారు.

Exit mobile version