Site icon NTV Telugu

955 రూబిక్ క్యూబ్స్ తో చిరు పిక్… మెగా అభిమానం

Anand and Bindu Priyanka performing Rubik's Cube Art of Megastar

మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో లో ఆయన ఉంటే ప్రాణమిచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువే. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ అభిమానాన్ని విభిన్నంగా చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడుకు చెందిన అభిమానులు చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్ కు చెందిన బిందు ప్రియాంక, ఆనంద్ కలిసి 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన పిక్చర్ ను తయారు చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Also : సలార్ అప్డేట్ : రాజమన్నార్ వచ్చేశాడు !

మరోవైపు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఆయన సినిమాలు “గాడ్ ఫాదర్”, “భోళా శంకర్” సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల కాంబోలో వచ్చిన మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. మరోవైపు మెగాస్టార్ ఈ సినిమాను పూర్తి చేసి “గాడ్ ఫాదర్, భోళా శంకర్” సినిమాలపై దృష్టి పెట్టారు.

Exit mobile version