Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర ప్రమోషన్లలో జోరు పెంచేశారు. నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నిన్ననే భారీ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా మూవీ నుంచి ‘కుబేర’ నుంచి ‘అనగనగా కథ’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున, ధనుష్‌పైనే సాంగ్ సాగుతోంది. ఈ పాట ఒకింత ఆలోచించే విధంగానే కనిపిస్తోంది. రెండు పాత్రల స్వభావాలను, వారి పరిస్థితులను ఇందులో వివరించబోతున్నారు.
Read Also : Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..
రష్మిక ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ఇందులో ధనుష్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంది. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే ఒకింత డిఫరెంట్ గా, భావోద్వేగాలను తట్టి లేపేవిగా ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి భావోద్వేగాల నేపథ్యంలోనే మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనగనగా కథ పాటను చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. హైడ్ కార్తి, కరీముల్లా పాడారు.
ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి మూవీ కావడంతో అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆసక్తిని రేపుతోంది. వారం ముందు వీరమల్లు, వారం తర్వాత కన్నప్ప సినిమాలు రాబోతున్నాయి. అయినా సరే మూవీని భారీ పోటీ నడుమ రిలీజ్ చేస్తున్నారు.
Read Also : Venkatesh : వాడిని అంచనా వేయడం కష్టం.. తన పాత్రపై వెంకటేశ్ కామెంట్స్..
