NTV Telugu Site icon

RC 16: మెగాస్టార్ ని కూడా దింపుతున్నావా? అసలు ఏం ప్లాన్ చేశావ్ బుచ్చి?

Rc16

Rc16

Amitabh Bachchan to Play Ramcharan Grand father Role: రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ మధ్యనే లాంచనంగా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ కి సన్నిహితుడుగా పేరు ఉన్న వెంకట్ సతీష్ కిలారు నిర్మాతగా మారుతున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దాంతోపాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ సినిమాకి సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఇక ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సినిమా కథ గురించి రకరకాల విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయామని సినిమా హీరో రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శివ రాజ్ కుమార్ కూడా వెల్లడించారు.

Ramayan : రణబీర్ రామాయణం మొదలైంది.. రంగంలోకి గురూజీ!

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, రామ్ చరణ్ కి విలన్ గా నటిస్తున్నాడని వార్త తెర మీదకి వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కనిపించబోతున్నారు, అది కూడా రామ్ చరణ్ పాత్రకి తాత పాత్రలో ఆయన కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని ముందు నుంచి చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అనే ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని సినిమా యూనిట్ చెప్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తాతగా బిగ్ బి అమితాబచ్చన్ నటించిన బోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాలలో హాట్ టాపిక్ అవుతుంది.

Show comments