NTV Telugu Site icon

“గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్న అమీర్ ఖాన్

Amir Khan along with Naga Chaitanya participated in Green India Challenge

మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అప్పుడే భవిష్యత్ తరాలకు ప్రకృతి లాభాలు చేకూరుతాయని అమీర్ అన్నారు.

Read Also : “పొన్నియన్ సెల్వన్” షూటింగ్ పూర్తి

ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్ధా” సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకపాత్రలో నటించారు. ఇదే నాగ చైతన్యకు హిందీలో మొదటి చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇక అమీర్ ఖాన్ ఇప్పుడు హైదరాబాద్ రావడానికి కారణం “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో అమీర్ ఖాన్ అతిథిగా కనిపించబోతున్నారు.