Site icon NTV Telugu

Ameerlog : హైలెట్‌గా మారిన రాహుల్ సిప్లిగంజ్ ‘అవ్వల్ దావత్’ సాంగ్

Ameer Log

Ameer Log

యూత్ ఫుల్ కామెడీగా అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా ‘అమీర్ లోగ్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ‘అమీర్ లోగ్’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో వైరల్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘అవ్వల్ దావత్’ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌కు పైగా వీక్షణలతో దూసుకుపోతోంది. ‘అవ్వల్ దావత్’ సాంగ్‌లో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం, ఆనీ మాస్టర్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో అందరినీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి ఎస్‌వికె సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version