NTV Telugu Site icon

Amazon Prime : తెరపైకి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్… వరుస వెబ్ సిరీస్‌ ల హంగామా

Amazon

Amazon

ముంబైలో జరిగిన కళ్లు చెదిరే ఈవెంట్‌ లో అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో తెరపైకి రానున్న కొన్ని వెబ్ సిరీస్ ల లిస్ట్ ను ప్రకటించి,ప్రేక్షకులను థ్రిల్ చేసింది. భారతదేశంలో ట్రాన్సాక్షనల్ వీడియో-ఆన్-డిమాండ్ (TVOD) మూవీ రెంటల్ సర్వీస్‌ను ప్రారంభించడంతో పాటు, రాబోయే 2 సంవత్సరాలలో రానున్న తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కలిపి మొత్తం 40 కొత్త సిరీస్‌లు, సినిమాలు ప్రకటించి, అమెజాన్ అభిమానులను ఉత్సాహపరిచింది. కొత్త ప్రాజెక్టులతో పాటు మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, పాతాళ లోక్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు కొనసాగింపుగా సీక్వెల్స్ ను కూడా అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ లిస్ట్ లో ఉన్న వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాము.

ఫర్జి
షాహిద్ కపూర్ హీరోగా నటించిన వెబ్ మూవీ “ఫర్జీ”. రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, విజయ్ సేతుపతి, కే కే మీనన్, రెజీనా కసాండ్రా, తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

దూత
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’. ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు “మనం” చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హారర్ థ్రిల్లర్‌లో ప్రాచీ దేశాయ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు.

మోడ్రన్ లవ్ హైదరాబాద్ (తెలుగు)
‘మోడరన్ లవ్ హైదరాబాద్‌’కి ఉదయ్ గుర్రాల, నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, దేవికా బహుదానం దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రేమకథలను ఈ సిరీస్‌ లో తెరకెక్కించబోతున్నారు. ఇందులో నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, సుహాసిని మణిరత్నం, అభిజిత్ దుద్దాల, రేవతి, నరేష్, మాళవిక నాయర్, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్కా గుప్తా తదితరులు నటిస్తున్నారు.

పంచాయత్ సీజన్ 2
బాలీవుడ్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ ‘పంచాయత్ సీజన్ 1’కు విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, జితేంద్ర కుమార్ నటించిన ఈ టెలివిజన్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో రెండవ సీజన్‌తో తిరిగి రాబోతోంది.

Read Also : Acharya Movie Review : అయ్యో.. ఆచార్య‌!

మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2
జోయా అక్తర్, రీమా కగ్టి దర్శకత్వం వహించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ సీజన్ 2తో తిరిగి తెరపైకి రాబోతోంది. శోభితా ధూళిపాలా, అర్జున్ మాథుర్, కల్కీ కోచ్లిన్, జిమ్ సర్భ్, శశాంక్ అరోరా, శివంగి రస్తోగి ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. 2019లో విడుదలైన మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో, సీజన్ 2పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

పాతాళ లోక్ సీజన్ 2
హథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించిన “పాతాళ లోక్ సీజన్ 1” సంచలనం సృష్టించింది. కరోనా ఫస్ట్ వేవ్, ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో OTT ప్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు Amazon Prime “పాతాళ లోక్” సీజన్ 2తో రాబోతోంది.

మీర్జాపూర్ సీజన్ 3
దేశంలోనే అత్యధికంగా వీక్షించిన సిరీస్ ‘మీర్జాపూర్’. ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 త్వరలో విడుదల కాబోతోంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, హర్షిత గౌర్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్ తదితరులు నటిస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
నేషనల్ అవార్డ్ విన్నర్ మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో పెద్ద హిట్ అయ్యింది. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 3తో మనకు మరో రోలర్ కోస్టర్ రైడ్ అందించబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంతా అక్కినేని, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్, పవన్ చోప్రా, శరద్ కేల్కర్, దలీప్ తాహిల్, దర్శన్ కుమార్, ఉదయ్ మహేష్, దేవదర్శిని తదితరులు కనిపించబోతున్నారు.