Site icon NTV Telugu

Kajol Devgan: భర్త లేనప్పుడు అతడితో కాజోల్ లిప్ కిస్.. మరీ నాలుగుసార్లా..?

Kajol

Kajol

Kajol Devgan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కాజోల్ రీ ఎంట్రీ కోసం ఎంతగానో కష్టపడుతోంది. దీనికోసం ఆమె ఓటిటీనే నమ్ముకుంది. గత కొంతకాలంగా ఓటిటీలో వస్తున్న వెబ్ సిరీస్ లు వలన సీనియర్ భామలు హిట్లు అందుకుంటున్నారు. సుస్మితా సేన్, రాణి ముఖర్జీ, విద్యాబాలన్ ఇప్పటికే మంచి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక తాజాగా కాజోల్ కూడా త్రిభంగ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సిరీస్ లో కాజోల్ సరసన బ్రిటిష్- పాక్ నటుడు ఆలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యనే ఆలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

” నేను మొదటి నుంచి కాజోల్ కు వీరాభిమానిని. ఆమెతో ఎప్పుడు నటిస్తానా అని ఎదురుచూశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఈ సిరీస్ లో ఆమెతో నాకు ఫ్రెంచ్ కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్ ను నిర్మిస్తోంది కాజోల్ భర్త అజయ్ దేవగణ్. ఒకరోజు ఆయన షూటింగ్ రాని సమయంలో ఈ ఫ్రెంచ్ కిస్ సీన్స్ షూటింగ్ జరిగింది. ఆమెతో పెదవి ముద్దును పంచుకున్నాను. ఒక్క సెకన్ల లోనే షాట్ ఓకే చేశాం. అయితే దానికన్నా ముందు నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయడం వలన చాలా ప్రొఫెషనల్ గా ఆ సీన్ ను మేము కంప్లీట్ చేశాం. ఆ సీన్ ను త్వరగా ఫినిష్ చేసినందుకు ఆమె థాంక్స్ డార్లింగ్ అని చెప్పుకొచ్చింది” అని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version