Site icon NTV Telugu

Buddy Trailer: యాక్షన్ ఎలెమెంట్స్ తో అదరకొడుతున్న బడ్డీ ట్రైలర్

1722336075099

1722336075099

Allu Shirish Buddy: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలు పెంచేశాయి. తాజగా మేకర్స్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. టెడ్డి బేర్ ఇంట్రడక్షన్ తో ట్రైలర్ మొదలవగా శిరీష్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. మొత్తం యక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ నిండిపోయింది. ఇక అలానే “బడ్డీ” సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విష్యం తెలిసిందే.

Also Read:Vijay Deverakonda: రష్మికతో నటించిన సినిమాలో విజయ్ తల్లి కూడా నటించిందని తెలుసా?

నేడు అదే విషయం ట్రైలర్ లో కూడా చూపించారు. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయిలు మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. “బడ్డీ” సినిమాకు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా “బడ్డీ” సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ అందించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఛాట్ బస్టర్స్ అయ్యాయి. “బడ్డీ” సినిమా ట్రైలర్ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న “బడ్డీ” సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి బడ్డీ తో శిరీష్ ఎలాంటి హిట్ అందుకుంటాడా చుడాలిసిందే.

Exit mobile version