NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ ని హత్తుకుని ఏడ్చేసిన అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫాన్స్ ఫిదా!

Allu Arjun Fan Crying Video

Allu Arjun Fan Crying Video

Allu Arjun”s diehard fan meets his hero video goes Viral: మెగా హీరోలలో ఒకరుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక తెలుగులో అనేకమంది స్టార్ హీరోలకు పోటీగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఆయన అభిమానులకు మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరెట్. అలాంటి అల్లు అర్జున్ ని ఒక సామాన్యమైన అభిమాని కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది మహా అయితే ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు అంతే కదా అనుకోవచ్చు. కానీ తాజాగా అల్లు అర్జున్ టీం షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Varalakshmi Sarathkumar : ‘అర్జునుడి గీతోపదేశం’ చెబుతానంటున్న వరలక్ష్మీ

అల్లు అర్జున్ అభిమాని ఒకరు అల్లు అర్జున్ ని కలుసుకునేందుకు వచ్చినట్లు టీం చెబుతోంది. దీంతో అల్లు అర్జున్ అతనిని దగ్గరకు తీసుకుని మాట్లాడడంతో సదరు అభిమానికి నోట మాట రాలేదు. అల్లు అర్జున్ ని ఇంత దగ్గరగా చూస్తున్నాను అనే ఆనందమో లేక మరి ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ ఆయన్ని చూసి షాక్ అయ్యి హత్తుకుని ఏడ్చేస్తూ కనిపించాడు. అల్లు అర్జున్ కూడా ఇదేంటి అని పక్కకి తోసేయకుండా అతని ఓదారుస్తూ సుమారు 40 సెకండ్ల పాటు ఆ వ్యక్తిని సముదాయిస్తూ కనిపించాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అందరూ అతని స్థానంలో మేము ఉంటే బాగుండు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమాన హీరో ఇలా దగ్గరకు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని ఆ అభిమాని ఎంతో అదృష్టం చేసుకున్నాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.