Site icon NTV Telugu

Allu arjun Voice: కామెడీ అయిపోయింది గురూ.. అల్లు అర్జున్ వాయిస్‌ను ట్రోల్ చేసిన హీరోయిన్ సోదరుడు

Nikhil Thomas Allu Arjun Vo

Nikhil Thomas Allu Arjun Vo

Allu arjun voice in desamuduru getting trolled: ఇప్పటి ఐకాన్ స్టార్ అప్పటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ లో దేశముదురు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో అయితే భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బన్నీ స్టైల్, ఆటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హన్సిక మోత్వానీ హీరోయిన్ గా పరిచయం అవగా ఆమె అందానికి, క్యూట్ నెస్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 2007లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడమే కాదు మంచి వసూళ్లు కూడా రాబట్టింది. 2007న 400 థియేటర్లలో విడుదలైన దేశముదురు సినిమాలో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. అయితే ఈ మధ్యనే బన్నీ పుట్టినరోజు సందర్భంగా సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు.
Niharika Konidela: ఆరెంజ్ కలర్ టాప్‌లో నిహారిక కొణిదెల హాట్ ట్రీట్.. చూశారా?
ఆ సంగతి అలా ఉంచితే దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి దొబ్బేస్తున్నారా? ఏంటి దాదాగిరినా? ఏంటి కామెడీనా? అంటూ కొందరు వ్యక్తులు చెబుతున్న డైలాగులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు నిఖిల్ థామస్ ఏమనుకున్నాడో ఏమో తాను తాజాగా ఒక వీడియో చూశాను, అందులో ఇలా ఉంది అంటూ బన్నీ వాయిస్ ను ఆయన కూడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయనకు బన్నీ వాయిస్ రాలేదు కానీ ఎవరైతే బన్నీ వాయిస్ ని ఇమిటేట్ చేస్తానని చెబుతూ ముందుగా వీడియో చేశాడో అతని వాయిస్ బాగా వచ్చింది. దీంతో నివేదా థామస్ తమ్ముడు అల్లు అర్జున్ వాయిస్ ను ట్రోల్ చేస్తున్నాడురా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Exit mobile version