ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటి నుంచి ఇతర వరల్డ్స్ టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని ఫాన్స్. బన్నీ సినిమా వస్తుంది అంటే జనరేట్ అయ్యే బజ్ వేరే ఏ హీరో సినిమాకి జనరేట్ అవ్వదు అనే రేంజులో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏడాది గడిచినా ఎవరూ మర్చిపోలేదు అంటే ఈ కాంబినేషన్ సెట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప ది రూల్ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ చీరకట్టుకోని, అమ్మోరిలా కనిపించి పాన్ ఇండియా ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, అలా చీర కట్టుకోని కనిపించడం అనేది ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చింది. ఇమేజ్ ని పక్కన పెట్టి అల్లు అర్జున్ చేసిన ఈ డేర్ ని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
ఈరోజు అల్లు అర్జున్ చీర కడితే ప్రతి ఒక్కరూ పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అల్లు అర్జున్ లేడీ గెటప్ వేస్తే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. ఇరవై ఏళ్ల పాటు అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్స్ కొట్టినా యాంటి ఫాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని ట్రోల్ చెయ్యడానికి ఫస్ట్ వాడే ఫోటో గంగోత్రి సినిమలోనిదే. ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ చీర కడితే అందరూ జేజేలు కొడుతున్నారు అంటే అది అల్లు అర్జున్ కష్టానికి ప్రతిఫలం. తను పెట్టిన ఎఫోర్ట్స్ అల్లు అర్జున్ ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆరోజు ఎత్తిన ప్రతి వేలు ఈరోజు ముడుచుకునేలా చేసిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంటాడు అనడంలో సందేహం లేదు.