మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. టాలీవుడ్ కి పిల్లర్స్ లాంటి చిరంజీవిని బాలకృష్ణని ఒకే వేదికపై చూసే అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలని మైత్రి మూవీ మేకర్స్ సమానంగా ప్రమోట్ చేసింది. ఈ ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ చిరు బాలయ్యలు కలిసి కనిపిస్తారని మెగా నందమూరి అభిమానులు ఆశించారు. ఈ అపూర్వ కలయికకి సరైన వేదిక ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో. ‘ఆహా’లో బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపపబుల్’ టాక్ షో సీజన్ 2 సంక్రాంతి సమయంలో మంచి జోష్ లో ఉంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి గెస్టులతో టాక్ షో మంచి వ్యూవర్షిప్ కూడా సొంతం చేసుకుంది. ఈ టాక్ షోకి చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్ కోసం కూర్చోబెట్టి ఉంటే బాగుండేది. చిరు బాలకృష్ణలు ఎదురెదురు కూర్చోని తమ సినిమాల గురించి మాట్లాడుకుంటే, సినీ అభిమానులకి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. ఈ పాయింట్ ని అలోచించి మేకర్స్ ‘అన్ స్టాపపబుల్’ షోలో చిరు బాలయ్యలని కలిపే ప్రయత్నం చేస్తారని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు.
ఈసారి మాత్రం అది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు అల్లు అరవింద. చిరు-బాలయ్యలని పెట్టి సినిమానే చేస్తాను అని సరదాగా చెప్పిన అల్లు అరవింద్… ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. కలిసి కూర్చోని మాట్లాడుకోవడానికి చిరు-బాలయ్య కూడా ఓకే చెప్పారని సమాచారం. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయ్యేలా కనిపించట్లేదు కాబట్టి మరి చిరు-బాలయ్యల ఇంటర్వ్యూలో ఆహా ఎప్పుడు టెలికాస్ట్ చేస్తుంది? అసలు ఏ ఆలోచనతో షూట్ చేస్తుంది? దీని వెనక అల్లు అరవింద్ స్కెచ్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మాస్ మూల విరాట్ అండ్ గాడ్ ఆఫ్ మాసెస్ కలిస్తే చాలు ఆహా యాప్ క్రాష్ అయిపోవాల్సిందే.
