బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల చేసిన ఒక పాన్ మసాలా యాడ్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ తో ఆ యాడ్ కంపెనీ ఇలాచీ బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలిగి, తాజాగా ఆ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో అక్షయ్ ప్రకటించారు. ఈ ట్వీట్ లో అక్షయ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినందుకు తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను ఒక గొప్ప పని కోసం విరాళంగా ఇస్తానని ప్రామిస్ చేశాడు.
Read Also : Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే ‘ఆచార్య’ను ఎలా కవర్ చేశాడంటే ?
అక్షయ్ తన ట్వీట్‌లో “నన్ను క్షమించండి. నేను మీకు, నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకుకు సంబంధించిన యాడ్ లను ఇక ఎప్పటికీ ప్రచారం చేయను. విమల్ ఇలాచీతో నా యాడ్ విషయంలో మీ రియాక్షన్ చూసి, వెనక్కి తగ్గాను. నేను ఈ ఎండార్స్‌మెంట్ కోసం తీసుకున్న మొత్తం పారితోషికాన్ని ఒక గొప్ప కార్యానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను చేసుకున్న ఈ యాడ్ అగ్రిమెంట్ లో చట్టపరమైన వ్యవధి ఉన్నంత వరకు బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయడం కొనసాగించవచ్చు. అయితే భవిష్యత్ లో యాడ్స్ ను ఎంపిక చేసుకోవడంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతిఫలంగా నేను మీ ప్రేమ, కోరికలను ఎప్పటికీ అడుగుతూనే ఉంటాను” అంటూ సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేశారు అక్షయ్.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022
కాగా అక్షయ్ కుమార్ నెక్స్ట్ మూవీ ‘పృథ్వీరాజ్’లో కనిపించనున్నారు. మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయన ఖాతాలో బడే మియా చోటే మియా, ఓ మై గాడ్ 2, గూర్ఖా ఉన్నాయి.