Site icon NTV Telugu

Bigg Boss Telugu 8 Teaser: ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు!

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu

Akkineni Nagarjun Bigg Boss Telugu 8 Teaser Released: బిగ్బాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 అఫీషియల్ టీజర్ ని బిగ్ బాస్ హౌస్ నాగార్జున రిలీజ్ చేశారు. మొదటి రెండు సీజన్ల తర్వాత నుంచి బిగ్ బాస్ ని నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. దానికి ముందు పలు పేర్లు వినిపించాయి కానీ చివరికి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్ లో దొంగ అయిన సత్య ఒక నిధుల భాండాగారం లోకి వెళ్లి అక్కడ నిధి దొంగలించే ప్రయత్నం చేస్తుండగా అల్లాదీన్ అద్భుత దీపం లాంటిది ఒకటి కనిపిస్తుంది. దానిని టచ్ చేయగానే జీనీగా ఉన్న నాగార్జున బయటకు వస్తాడు.

Bunny Vasu: అల్లు అరవింద్ థియేటర్లు.. అసలు సీక్రెట్ చెప్పేసిన బన్నీవాసు

బయటకు వచ్చి ఏదైనా కోరిక కోరుకోమంటాడు. సత్య కోరిక కోరుకునే లోపు ఆలోచించుకునే అడుగు ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ బిగ్ బాస్ సీజన్ 8 ట్యాగ్ లైన్ ని నాగార్జున చెబుతున్న వీడియోని షేర్ చేశారు. ఇక దీన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన నాగార్జున బిగ్ బాస్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈ ప్రోమో అంత ఆసక్తికరంగా లేకపోయినా సీజన్ ని మాత్రం ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నట్లుగా లీకులు బయటకు వస్తున్నాయి. కాంట్రవర్షియల్ క్యాండిడేట్లను వెతికి మరియు లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే పలు పేర్లు తెరమీదకు వచ్చినా మొదటి రోజు హౌస్ లోకి ఎంటర్ అయ్యే వరకు అవి నిజమని చెప్పలేం.

Exit mobile version