Site icon NTV Telugu

Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ

Akhil’s Lenin

Akhil’s Lenin

అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమాను , అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై ఈ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా ఎంపికైంది. తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

Also Read : Bhagavad Gita : భగవద్గీత పై ఏఐ షార్ట్ ఫిల్మ్..

శ్రీలీలాను లెనిన్ చిత్రం నుంచి తప్పించిన తర్వాత మేకర్స్ షూటింగ్ పనులను మరింతగా వేగవంతం చేశారు. అయితే శ్రీలీలాతో ఇప్పటికే తీసిన ఓ 2 వారాల సీన్లను ఇప్పుడు భాగ్యశ్రీ తో రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీ లీలా తో తీసిన సీన్స్ అన్నింటిని మళ్లీ చిత్రీకరించబోతున్నారు. దీంతో టీమ్‌కు మరింత పని భారం పడనుందని అంటున్నారు. కాగా భాగ్యశ్రీ జూలై 16 నుండి షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అవుతున్నట్టు.. సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తుండగా. మాస్ అప్పీల్, స్టైలిష్ కథనంతో అఖిల్ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాడా? అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.

Exit mobile version