Site icon NTV Telugu

Lenin : అఖిల్ ‘లెనిన్’ లేటెస్ట్ అప్ డేట్ ?

Lanin

Lanin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ పై వరుస రూమర్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా గురించి  మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.

Also Read : Aamir Khan : ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్

తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో అఖిల్ పాత్రకు ఓ సిస్టర్ రోల్ కీలకంగా ఉండబోతోందని టాక్. ఆ పాత్రను ఒక సీనియర్ హీరోయిన్ పోషించనుందని, ఇది కథలో చాలా ఎమోషనల్ ట్రాక్ గా సాగుతుందని సమాచారం. క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎమోషనల్ హై పాయింట్ అవుతుందని కూడా వినిపిస్తోంది. అంతేకాదు, అఖిల్ చేస్తున్న లెనిన్ రోల్‌లో నెగటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది అఖిల్ కెరీర్‌లో కొత్తదనాన్ని తీసుకురావొచ్చని సినీ వర్గాల అంచనా.

ఇకపోతే, ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంతో తెరకెక్కుతోంది. అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలో ఉండబోతుందట. ఇది అతని పాత్రకు మరింత న్యాచురల్ ఫీల్ తెస్తుందని యూనిట్ చెబుతోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం, ‘లెనిన్’ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కెరీర్‌లో సరైన బ్రేక్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. మొత్తానికి, రాయలసీమ యాసలో మాస్ టచ్, ఎమోషనల్ ట్రాక్స్, నెగటివ్ షేడ్స్ అని కలిపి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌లో గేమ్ చేంజర్ అవుతుందా? అన్నది చూడాలి.

Exit mobile version