NTV Telugu Site icon

Ajay Bhuapathi: నా చేయి తీసుకుని గుండె మీది పెట్టి చూడమన్నాడు

Ajay Bhupathi Magalavaaram

Ajay Bhupathi Magalavaaram

Ajay Bhupathi About Mangalavaaram Movie:”యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్‌ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ‘ఆర్ఎక్స్ 100’ వైబ్స్ కనిపించాయమొ ట్రైలర్ పెద్ద హిట్ అయ్యిందన్నారు. ముందు మీడియాకు రెండు స్క్రీన్లలో షోస్ వేయాలని మేం అనుకున్నాం, తర్వాత పెయిడ్ ప్రీమియర్లు రెండు మూడు థియేటర్లలో వేస్తే చాలని అనుకున్నాం అలాగే హీరోయిన్, క్యారెక్టర్ బేస్డ్ మూవీ కనుక ప్రేక్షకులు చాలా నెమ్మదిగా వస్తారని అనుకున్నా కానీ పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి ఆల్మోస్ట్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. తర్వాత పెయిడ్ ప్రీమియర్ షోలు పెంచాం, సినిమా చూసిన వాళ్ళు ఎంతో బాగా చూపించారు.

NTR 100 Rupees Coins: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

‘ఆర్ఎక్స్ 100’ కంటే బెస్ట్ సినిమా అంటున్నారు, టేకింగ్, అజనీష్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. మ్యూజిక్ మనసులోంచి పోవడం లేదని ఓ ప్రేక్షకుడు చెప్పాడు, నా చేయి తీసుకుని గుండె మీది పెట్టి చూడమన్నాడు. ఇంకో ప్రేక్షకుడు శివేంద్ర కెమెరా వర్క్ గురించి మాట్లాడాడు, నేను మూడు సినిమాలు తీస్తే ముగ్గురు తెలుగు కెమెరా మ్యాన్స్ వర్క్ చేశారు. దర్శకుడికి విజువల్ సెన్స్ ఉండి చెప్పగలిగితే… ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎడిటర్ కూడా అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి ఊరిలో వేసిన సెట్ చూసి పాయల్ కూడా గుర్తు పట్టలేదు, ‘మనం వేసిన సెట్ ఆ?’ అని అడిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పా… ‘ఇది టెక్నీషియన్స్ మూవీ’ అని! ఈ రోజు అందరూ టెక్నికల్ వర్క్, ట్విస్ట్స్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. అందుకని రస్టిక్, రియలిస్టిక్ బ్లాక్ బస్టర్ అని వేశా, రివ్యూలలో ట్విస్ట్ గురించి రాయలేదు. నేను రాయవద్దని రిక్వెస్ట్ చేశా అందుకే వాళ్ళు కూడా హైడ్ చేశారు, వాళ్ళకు థాంక్స్. ఆర్టిస్టులు అందరికీ పేరు పేరునా థాంక్స్, ‘కేవలం క్యారెక్టర్ మీద ఫస్టాఫ్ నడిపావ్’ అని పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ నేను స్టార్లతో తీయలేదు. కొత్తవాళ్లతో బ్లాక్ బస్టర్ తీశా. మరోసారి ఎందుకు ప్రయోగం చేయకూడదని అనుకున్నా, ‘మంగళవారం’ చూసిన ప్రేక్షకుల నుంచి నాకు రెస్పెక్ట్ లభించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్లాక్ బస్టర్ అంటున్నారు, ఇది టీమ్ అందరి హిట్. మేమంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అవుటాఫ్ బాక్స్ స్టోరీ తీసుకుని హిట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది.