Site icon NTV Telugu

Supreme Hero: సాయి తేజ్ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్!

Ajaneesh Srinath

Ajaneesh Srinath

Ajaneesh Loknath To Compose Music To Sai Dharam Tej Film: సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తున్న నూతన చిత్రానికి పాన్ ఇండియా సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ‘విక్రాంత్ రోణ, కాంతారా’ చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ఇప్పుడు సాయితేజ్ నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్‌కు అద్భుతమైన స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించబోతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ వద్ద రచన విభాగంలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో వుంది. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version