Site icon NTV Telugu

Aishwaryaa Rajinikanth : ఇక కలిసే ఛాన్స్ లేదు… సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ డాటర్

Aishwaryaa-Dhanush

Aishwaryaa Rajinikanthఇక ధనుష్ తో కలిసే ఛాన్స్ లేదన్న విషయంపై సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేసింది. జనవరి 17న ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వారి అభిమానులతో పాటు సౌత్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే ధనుష్ తండ్రి మాత్రం ఇవి కేవలం కుటుంబ కలహాలని, త్వరలోనే ఈ జంట కలుస్తారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పలకరించుకోవడం, ధనుష్ తన మాజీ భార్యను ఫ్రెండ్ అంటూ అభివర్ణించడం, ఐశ్వర్య తన పేరుకు చివర ధనుష్ అనే పేరును తొలగించకపోవడం చూసి అంతా వీరిద్దరూ కలుస్తారని భావించారు. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ అభిమానులు ఈ స్టార్ కపుల్ కలవాలని కోరుకున్నారు. కానీ తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది ఐశ్వర్య.

Read Also : Ajith : 100 కోట్ల రెమ్యూనరేషన్… జాబితాలో మరో స్టార్

సోషల్ మీడియా ఖాతాలలో తన పేరుకు ఇన్నాళ్లూ యాడ్ చేసుకున్న ధనుష్ అనే పేరును తొలగించేసింది. దీంతో ఐష్, ధనుష్ మళ్ళీ కలుస్తారని వస్తున్న వార్తలకు సైలెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టేసింది ఐష్. ఇంతకుముందు @ash_r_dhanush అని ఉండే ఐశ్వర్య సోషల్ మీడియా ఖాతాలు ఇప్పుడు @ash_rajinikanthగా కన్పిస్తున్నాయి. 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఈ జంట ఇకపై కలిసే అవకాశం లేదనే విషయాన్నీ మొత్తానికి చెప్పకనే చెప్పేసింది సూపర్ స్టార్ డాటర్. ప్రస్తుతం ఐశ్వర్య తన పూర్తి ఫోకస్ మొత్తం డైరెక్షన్‌ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ కు ‘ఓ సాథీ చల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసింది. హీరో, హీరోయిన్ల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. ధనుష్ మాత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, హాలీవుడ్ భాషల్లోనూ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు. అన్ని భాషల్లోనూ ధనుష్ తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు శ్రమిస్తున్నాడు.

Exit mobile version