NTV Telugu Site icon

BheemlaNayak : తెలుగు ఓటీటీకి స్ట్రీమింగ్ రైట్స్

bheemla nayak

bheemla nayak

ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం “భీమ్లా నాయక్”పైనే ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తెలుగు ఓటీటీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓటిటి ట్రేడ్‌లో సింహభాగం కైవసం చేసుకోవాలని నిశ్చయించుకున్న ‘ఆహా’… దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకేస్తోంది. హిట్ టాక్ షోలు, వెబ్ ఫిల్మ్‌లు, సిరీస్‌లు, సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంటూ దిగ్గజ ఓటిటి సంస్థలకు గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పెద్ద చిత్రాలను ‘ఆహా’ ప్రేక్షకులకు అందించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ‘ఆహా’ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

Read Also : Vijay : చెన్నై ఎలక్షన్స్ లో హీరో వల్ల అసౌకర్యం… సారీ చెప్పిన స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ ఆహా సబ్‌స్క్రైబర్ బేస్ పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇక మరిన్ని పెద్ద సినిమాలను కొనుగోలు చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తోందని, ఒప్పందాలు కుదిరిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఆహా తమిళ OTT స్పేస్‌లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే ‘భీమ్లా నాయక్’ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. ఇక “భీమ్లా నాయక్‌”ను ఆహా భారీ ధరకు కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకూ ఈ ఓటిటిలో జరిగిన అతిపెద్ద డీల్ ఇదేనని తెలుస్తోంది. గతంలో క్రాక్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి పెద్ద సినిమాలను ఆహా ప్రసారం చేసిన విషయం తెలిసిందే.