Site icon NTV Telugu

Cobra: ఆకట్టుకున్న ‘అధీర..’ సాంగ్ లిరికల్ వీడియో!

Cobra

Cobra

Cobra: చియాన్ విక్రమ్ కధానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సినిమాలోని ‘అధీరా..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ పాటని ఫుట్‌టాపింగ్, రాకింగ్ నంబర్‌ గా కంపోజ్ చేశారు. ఈ పాట కథానాయకుడి పాత్ర లక్షణాల వర్ణిస్తూ సాగింది. రాకేందు మౌళి అద్భుతమైన రచన చేయగా, దానిని అంతే చక్కగా హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఆలపించారు.

శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Exit mobile version