Actress Sowmya Shetty Releases a Video: కొద్దిరోజుల క్రితం విశాఖపట్టణంలో కలకలం రేపిన బంగారం చోరీ కేసులో తన తప్పేమీ లేదని నటి సౌమ్య శెట్టి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒక రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో పరిచయం పెంచుకున్న సౌమ్య శెట్టి పలు దఫాలుగా వారి నివాసం నుంచి కేజీ బంగారం చోరీ చేసిందని కేసులు నమోదయ్యాయి. సదరు సౌమ్య శెట్టి గోవాలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా తరలించారు. అయితే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. సదరు మౌనిక అక్రమ సంబంధం కారణంగా బంగారం అమ్మి పెట్టమని అడిగితే ఒక స్నేహితురాలిగా అమ్మకానికి సిద్ధమయ్యాను తప్ప తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో మరోసారి తమ కుటుంబం పరువు తీస్తోంది అంటూ సదరు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
The Goat Life: తెలుగు డైరెక్టర్‌లకి ‘ది గోట్ లైఫ్’ ప్రీమియర్ షో.. అదిరిందట బాసూ!
ఈ నేపథ్యంలో సౌమ్య ఒక వీడియో రిలీజ్ చేసింది. నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, ఫేక్ ఎలిగేషన్ చేశారు. పోలీసులు నాకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. నేను రిమాండ్ లో లేకపోయినా రిమాండ్ లో ఉంది, జైల్లో ఉందని మీడియాకి తప్పుడు సమాచారం ఇచ్చారు. అలా చేసి నేషనల్ వైడ్ నన్ను అన్ పాపులర్ చేశారు. నేను కూడా ఈ సొసైటీలో బతకాలి కాబట్టి నేను కూడా నా వెర్షన్ చెప్పుకోవాలి కదా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అసలు మొదలు పెట్టింది, మీరే ఇప్పుడు బయటకు వచ్చి నిజాలు చెబుతుంటే మళ్ళీ ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ని నిందలు నా మీద వేసిన తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను, కానీ నా భర్త ఆపి ఫైట్ చేయాలని నాకు ధైర్యం చెప్పాడు. నా మీద ఇంత పెద్ద కేసు పెట్టారు, దానికి నేను పోరాడుతున్నా, ఇప్పుడు మరికొన్ని కేసులు నా మీద పెట్టారు.
పర్లేదు ఇంకా పోరాడుతా. మీకు డబ్బులు ఉండొచ్చు, దానివల్ల నామీద కేసులు పెట్టవచ్చు కానీ నన్ను భయపెట్టలేరు. నాకు నిజంగా ఇక భయం పోయింది. మీరు కేసులు పెడుతున్నారు కానీ ఆర్టికల్ నైన్టీన్ గురించి మర్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే స్వేఛ్చ ఉంది. కానీ ఒక విషయంలో మాత్రం నేను మీకు థాంక్స్ చెప్తున్నాను, నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నన్ను నేషనల్ వైడ్ ఫేమస్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన సమయంలోనే ఇలాగే ఆయన డ్రగ్స్ కి బానిస అయ్యాడని, పిచ్చెక్కిందని రకరకాల ప్రచారాలు చేశారు. కానీ ఆయన మరణానికి కారణం ఏంటో ఇప్పటికీ తేల్చలేకపోయారు. నా మీద కూడా దొంగ అనే ముద్ర వేసి జైలుకు పంపే ప్రయత్నం చేశారు కానీ అది కూడా జరగలేదు. ఏ తప్పు చేయని నేను ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకుని తీరుతాను, నా చివరి ఊపిరి వరకు వెనక్కి తగ్గేది లేదు అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది.
