Nadhiya Daughters: నదియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆమె తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక రీ ఎంట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించి మెప్పించారు నదియా. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అత్త పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది. నిజానికి తమిళంలో పూవే పూచూడవా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నదియా. నదియా ఇంతకు ముందు కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా నటించడం గమనార్హం.
Ilayaraja: ఇళయరాజా పారితోషికం తీసుకోకుండా మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?
పూవే పూచూడవా తర్వాత రాజాతిరాజా, అన్పుళ్ల అప్ప, చిన్నతంబి పెరియ తంబి వంటి పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తమిళ అభిమానులకు ఫేవరెట్ అయింది. సినీ పరిశ్రమలో అగ్రనటిగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. నటి నదియా 1988లో శిరీష్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు జానా మరియు సనమ్ ఉన్నారు. నటి నదియా అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తో ఉంటుంది. అలాగే ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు హీరోయిన్ల కంటే నదియా కూతురే ఎక్కువ అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నదియా కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.