NTV Telugu Site icon

Kapila Venu: గుడిలో నటికి దారుణ అనుభవం.. ఫిజికల్గా టచ్ చేసి?

Kapila Venu

Kapila Venu

Actress Kapila Venu Shares her bad Experience at a Temple: ఇటీవల విడుదలైన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన కేరళ రాష్ట్రానికి చెందిన కూడియాట్టం నర్తకి కపిల వేణుకి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్లు ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసింది. తన స్నేహితురాలి పర్ఫామెన్స్ చూడడం కోసం లోకల్ లో ఉన్న ఒక గుడి ఉత్సవానికి తాను ఒంటరిగా హాజరయ్యానని చెప్పుకొచ్చింది. తనకు తెలియక ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశానని అయితే ఆ విషయం అర్థమైన వెంటనే ఆ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ క్యూలోకి వెళ్లేందుకు ప్రయత్నించానని ఆమె చెప్పకు వచ్చారు. తాను ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదని ఎగ్జిట్ లో నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయడం కంటే ఎంట్రీ క్యూలోకి వెళ్లడం నయం అనుకుని వెంటనే ఆ పని చేశానని చెప్పుకొచ్చారు.

Devi Prasad: టాలీవుడ్ రైటర్ కి డైరెక్టర్ వార్నింగ్.. అవాకులు పేలితే అంతే అంటూ!

అలా చేసిన వెంటనే అక్కడే ఉన్న ఒక వాలంటీర్ వచ్చి తనను టచ్ చేసి ఆపేసి చాలా రూడ్ గా మాట్లాడాడని చెప్పుకొచ్చారు. తను మాత్రం ఊహించకుండా జరిగిన ఈ పరిణామంతో తాను కూడా అతని ఓవర్ యాక్షన్ కి అఫెండయ్యానని, ఏమైనా ఉంటే మాటలతో చెప్పి ఆపవచ్చు కానీ ఇలా టచ్ చేయడం ఏమిటని గట్టిగానే ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. అతను కూడా ఏమాత్రం తగ్గక పోవడంతో నేను కూడా అలా అరవడం తప్పని గట్టిగానే చెప్పానని ఈ విషయం జరుగుతున్న సమయంలో దాదాపు మరో ఆరుగురు వాలంటీర్లు వచ్చారని వివిధ వయసుల్లో ఉన్న వారందరూ నాదే తప్పు అన్నట్లు నన్ను టార్గెట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ సీన్ చేయొద్దు, వెంటనే వెళ్ళిపోవాలని వాళ్లంతా తనను కోరారని ఆమె చెప్పుకొచ్చింది. తనకు పానిక్ ఎటాక్ కూడా అవుతుందేమోనని భయం వేసి పోలీస్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్లాను అని, అయితే పోలీసులు కూడా వెంటనే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అని చెప్పుకొచ్చారు.

తనకు కన్నీళ్లు ఆగలేదని తన కన్నీళ్లు చూసిన తర్వాత పోలీసులు కమిటీ మెంబర్లతో మాట్లాడమని చెప్పారని అన్నారు. ఆ కమిటీ మెంబర్లలో ఒకరు వచ్చి వాలంటీర్ల దగ్గర మాట్లాడిన తర్వాత నా తండ్రి పేరు తెలుసుకొని లోపలికి పంపించారు. నేను ఇంకేదో జరుగుతుంది అనుకుంటే తండ్రి పేరు కనుక్కొని లోపలికి పంపించడం నాకు నచ్చలేదు. అయినా ఒంటరిగా ఇలా గుడికి వెళ్ళాలి అనుకోవడం నాది తప్పు. ఒక చిన్న టౌన్ లో ఉండే నేను ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించకపోవడం నాదే తప్పు. జనాలు చాలా ఎక్కువగానే వచ్చారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అక్కడి వాలంటీర్లకు ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా సరే ఇంకా జాగ్రత్తగా చేసి ఉండాల్సింది అంటూ ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.