Site icon NTV Telugu

Oscars 2024: పాపం…. ఆస్కార్ అవార్డు తీసుకుంటున్న హీరోయిన్ డ్రెస్ చిరిగిపోయింది!

Emma Stone Dress

Emma Stone Dress

Emma Stone Dress Torn While Receiving Oscars 2024 : హాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ లలో ఎమ్మా స్టోన్ కూడా ఒకరు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె రెండు దశాబ్దాల కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఆమె కెరీర్లో నాలుగు ఆస్కార్‌లు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆమెకు చాలా చిరస్మరణీయమైనది, ఎందుకంటే ఎమ్మా స్టోన్ తన నాల్గవ ఆస్కార్‌ను 96వ అకాడమీ అవార్డులలో అందుకుంది. పూర్ థింగ్స్ చిత్రానికి గానూ ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ అవార్డు అందుకున్న తర్వాత నటి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. స్టార్ కాస్ట్ అలాగే పూర్ థింగ్స్ కుటుంబానికి ఎమ్మా స్టోన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ సమయంలో నటి వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ కి బాధితురాలు అయ్యింది. ఆమె దుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆమె వేదికపైకి వచ్చి చిరిగిన దుస్తులను చూపించింది. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ పేరు అనౌన్స్ చేసినప్పుడు, ఆమె చాలా ఆశ్చర్యానికి మరియు భావోద్వేగానికి గురైంది.

Rashmika Mandanna : రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..

నటి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. వేదికపైకి వచ్చి ఆస్కార్ అవార్డును అందుకుంటున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, ఎమ్మా తన చిరిగిన దుస్తులను చూపించింది. “ఓహ్, నా డ్రెస్ చిరిగిపోయింది,” అని ఆమె చెప్పింది. ఎమ్మా స్టోన్ తన దుస్తులు చిరిగి పోవడానికి ర్యాన్ గోస్లింగ్‌ కారణం అని పేర్కొంది. ర్యాన్, ఎమ్మా కలిసి ఆస్కార్ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో ఆమె దుస్తులు వెనుక నుంచి చిరిగిపోయాయి. ఇక ఆ తరువాత నటి ఉద్వేగభరితమైన ప్రసంగం ఇచ్చింది. ఇక ఎమ్మా స్టోన్ 10 సంవత్సరాల తర్వాత ఉత్తమ నటిగా రెండవ ఆస్కార్ అందుకున్నారు. ఇంతకుముందు, ఆమె బర్డ్‌మ్యాన్ (2014) చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకుంది. ఆమె లా లా ల్యాండ్ మరియు ది ఫేవరెట్ చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా రెండు ఆస్కార్‌లను కూడా గెలుచుకుంది.

Exit mobile version