NTV Telugu Site icon

Anjali: ‘మాచర్ల నియోజకవర్గం’ లో అంజలికి ఏం పని..?

Anjali

Anjali

యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వాన్ తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నితిన్.. కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరింత అంచనాలను పెంచడానికి అందాల భామ అంజలిని రంగంలోకి దింపారు మేకర్స్.. ఈ చిత్రంలో ఊర మాస్ సాంగ్ లో ఐటెంభామగా అంజలి కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అంజలి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఐటెం నంబర్ లో అంజలి హాట్ హాట్ గా అందాలను ఆరబోయనుందని టాక్ నడుస్తోంది.

అంజలికి ఐటెంసాంగ్స్ కొత్తేమి కాదు.. చిలకలూరి చింతామణి అంటూ సరైనోడు చిత్రంలో బన్నీ సరసన ఆడిపాడి మెప్పించింది తెలుగమ్మాయి. అప్పట్లో ఈ సాంగ్ ఎంతటి సంచలనాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత మరోసారి ఐటెం నెంబర్ లో కనిపించనుంది హాట్ బ్యూటీ. ఈ సాంగ్ షూట్ హైదరాబద్ లో భారీ వ్యయంతో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకొంటుంది. నితిన్ ఊర మాస్ స్టెప్పులు, అంజలి ఘాటు అందాలతో సినిమాకు ఈ సాంగ్ హైలైట్ గా నిలవుందని చిత్ర బృందం తెలుపుతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.