Site icon NTV Telugu

ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి కన్నుమూత…

ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఈరోజు ఉదయం బసవతారకం ఆసుపత్రిలో ఉదయం 8 గంటల ముప్పై నిముషాలకు మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ పలువురు సినీ ప్రముఖులు బసవతారకం హాస్పిటల్ కి వెళ్లి ఉత్తేజ్ ని పరామర్శించారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఉత్తేజ్ చేసే సేన కార్యక్రమాలలో ఆయన భార్య పద్మ కూడా ఎప్పుడు భాగమయ్యేవారు. అయితే భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌ అలాగే ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి అని తెలిపారు.

Exit mobile version