NTV Telugu Site icon

దశాబ్దకాలంగా మధుర జ్ఞాపకాలు.. కార్తి​కేయ-లోహిత వైరల్ పిక్స్

‘ఆర్‌ఎక్స్ 100’ ఫ్రేమ్ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఆ అమ్మాయి ఎవరా..? అంటూ చాలామంది సినీ అభిమానులు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారు.. పెద్దలు కుదిర్చిన సంబంధం అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా కార్తికేయ ఈ నిశ్చితార్థంపై స్పందించారు. ఆమెను పరిచయం చేస్తూ ట్విట్టర్ లో పాత ఫోటోను షేర్ చేశారు.

‘2010లో నిట్‌ వరంగల్‌లో తొలిసారి లోహితను కలిశాను. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది’అంటూ పేర్కొన్నాడు. దశాబ్దకాలంగా ఆ మధుర జ్ఞాపకాలకు సంబందించిన ఫోటోలను కార్తికేయ షేర్‌ చేశాడు.