వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే స్పెయిన్ లో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హ్రితిక్ పాల్గొన్న ఈ షెడ్యూల్ లో అయాన్ ఒక ఛేజ్ సీక్వెన్స్ ని షూట్ చేసాడు. ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో, ఎన్టీఆర్ డూపుతో వార్ 2 ఛేజ్ సీక్వెన్స్ ని షూట్ చేసాడు అయాన్. ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి ఉన్న ఒక్క లీక్డ్ పిక్ అయినా బయటకి వచ్చేది కానీ అలా జరగలేదు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కైనా ఎన్టీఆర్-హ్రితిక్ కలిసిన ఫోటో బయటకి వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఎండ్ కార్డ్ త్వరలోనే పడనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం… వార్ 2 ప్రోమో షూట్ కోసం ఎన్టీఆర్, హ్రితిక్ కలిసి ఒక ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారట. ఈరోజు ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ ప్రోమో షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న టాక్. వినడానికి బాగుంది కానీ ఈ వార్తలో ఎంతవరకూ నిజముంది అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ దేవర గోవా షెడ్యూల్ లో ఉన్నాడు. ఒకవేళ ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఎన్టీఆర్ ముంబై వెళ్లి ఉంటాడు అనుకున్నా కూడా కనీసం ఎయిర్పోర్ట్ ఫోటోస్ బయటకి వచ్చేవి. హైదరాబాద్ కే ఎన్టీఆర్ తిరిగి వచ్చినట్లు ఎక్కడా ఫోటోలు లేవు కాబట్టి వార్ 2 ప్రోమో గురించి వచ్చే వార్తల్లో నిజం ఉండక పోవచ్చు.
