NTV Telugu Site icon

Naga Bandham: కేజీఎఫ్ నటుడితో నాగబంధం.. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

Nagabandham

Nagabandham

Abhishek Nama to Direct Naga Bandham: అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూఢచారి, డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన నిర్మాత & డిస్ట్రిబ్యూటర్. ఇక ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పునర్నిర్వచించేలా ఒక మాజిస్టిక్ అడ్వెంచర్ ని రూపొందించనున్నారు. థండర్ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 9ని మధుసూదన్ రావు నిర్మిస్తున్నారు. ‘డెవిల్‌’తో దర్శకత్వ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ నామా ఈ భారీ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాసుకున్నారు అభిషేక్ నామా. ఉగాది శుభ సందర్భంగా అభిషేక్ పిక్చర్స్ తమ గ్రాండ్ వెంచర్ టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ఒకదాన్ని రిలీజ్ చేసి రివీల్ చేశారు. ఇక ఈ సినిమాకి ‘నాగబంధం’ అనే టైటిల్‌ ఫిక్స్ చేయగా ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్.

Ganesh Master: డైరెక్టర్ గా మరో కొరియోగ్రాఫర్?

మంత్రముగ్ధులను చేసే ఇంట్రడక్షన్ వీడియో అందరిలో ఆసక్తి పెంచేలా ఉంది. ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్, అద్భుతమైన విజువల్స్‌ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. KGF ఫేమ్ అవినాష్ పోషించిన మిస్టీరియస్ అఘోరి పాత్రను పరిచయం చేస్తూ, వీడియో ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్త్తోంది. లీడ్ యాక్టర్ ఎవరు? అనే అంశం మాత్రమే కాకుండా నిధి కోసం థ్రిల్లింగ్ హంట్ కు సంబధించిన క్యురియాసిటీని పెంచుతోంది. ఇక ఈ సినిమాకి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీ కాగా, అభే సంగీత దర్శకుడు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Show comments