Site icon NTV Telugu

Abhinaya Sree: బిగ్ బాస్ అంతా మోసం.. రూ. 5 లక్షలు నాకెవ్వరు ఇవ్వలేదు

Abhi

Abhi

Abhinaya Sree: అ అంటే అమలాపురం అంటూ ఆర్యతో ఓ రేంజ్ లో అరిపించిన బ్యూటీ అభినయ శ్రీ.. ఐటెం సాంగ్స్ తో కుర్రకారును ఉర్రుతలూగించిన ఈ భామ బిగ్ బాస్ సీజన్ 6 లో తళుక్కున మెరిసి ఔరా అనిపించింది. చాలా రోజుల తరువాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని, బిగ్ బాస్ ప్లాట్ ఫార్మ్ తనకు మంచి అవకాశాలను వచ్చేలా చేస్తుందని నాగ్ ముందు చెప్పి లోపలి వెళ్ళింది. ఇక మొదట ఈమెను చూసినవారందరు అబ్బో ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తుంది.. అందరితో గట్టిగా మాట్లాడుతుంది అని అనుకున్నారు. కానీ, అక్కడ జరిగింది వేరు.. అభినయ ఎంతో సాఫ్ట్ గా కనిపించింది. అందరితో కలివిడిగా ఉన్నా టాస్కుల విషయంలోనూ, గొడవల విషయంలోనూ అస్సలు మాట్లాడిందే లేదు. దీంతో ఈ ఆదివారం ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక బయటికి వచ్చాకా ఆమె బిగ్ బాస్ అంతా మోసం అని చెప్పాడం హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ కోసం తాను రూ. 5 లక్షలు తీసుకున్నాను అనేది కూడా అబద్దమే అని చెప్పుకొచ్చింది. తనకు పారితోషికం ఎక్కువ ఇవ్వలేదని చెప్పుకొచ్చిన అభినయ.. అసలు స్క్రీన్ లో తనను చూపించలేదని వాపోయింది. ఇన్నిరోజుల్లో కొంతమందిని మాత్రమే బిగ్ బాస్ యాజమాన్యం చూపిస్తోందని, వెనుక ఉన్నవారిని అస్సలు చూపించడం లేదని తేల్చి చెప్పింది. బిగ్ బాస్ వలన నాకు బ్యాడ్ జరిగిందే తప్ప గుడ్ జరగలేదని, ఇప్పుడు బిగ్ బాస్ లోపల ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని చెప్పింది. అంతా మోసమని, బిగ్ బాస్ తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version